కోవిడ్ నుంచి కోలుకుంటే.. రక్తదానం చేయండి : అజయ్ దేవ్ గన్ , హృతిక్ రోషన్

by Shyam |
కోవిడ్ నుంచి కోలుకుంటే.. రక్తదానం చేయండి : అజయ్ దేవ్ గన్ , హృతిక్ రోషన్
X

దిశ వెబ్ డెస్క్: కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారి రక్తంతో ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కరోనాతో పోరాటం చేస్తున్న ఎందరో బాధితులను కాపాడవచ్చని … ముంబై మున్సిపల్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ముంబై లోని కస్తూర్బా ఆస్పత్రి వైద్యులు కూడా కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్తం స్వీకరించడానికి ఓ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. అయితే బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్ గన్, హృతిక్ రోషన్ లు దీనికి తమ మద్దతు తెలిపారు. కరోనా పై పోరాటం చేసి మీరు కోలుకున్నారా అయితే రక్తదానం చేయండంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.

రక్తదానం, ప్లాస్మా థెరపీ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్ గన్, హృతిక్ రోషన్ లు ముందుకు వచ్చారు.

హృతిక్ రోషన్:

‘మీరు ఇటీవలే 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత నెగెటివ్ రిజల్ట్ వచ్చిందా. అయితే మీ రక్తంలోని కణాలకు కరోనా వైరస్ ను చంపే శక్తి ఉంది. మీరు మీ రక్తాన్ని దానం చేస్తే.. కోవిడ్ తో పోరాటం చేస్తున్న ఎంతోమందిని కాపాడవచ్చు. రక్తదానం చేయండి. ప్రాణదాతలు అవ్వండి’ అంటూ బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చాడు.

అజయ్ దేవ్ గన్:

‘కోవిడ్ -19 నుంచి కనుక మీరు కోలుకుంటే మీరే నిజమైన పోరాట యోధులు. కంటికి కనిపించని కరోనా వైరస్ శత్రువు నుంచి కాపాడుకోవడానికి మీలాంటి ఎందరో యోధులు అవసరం ఎంతో ఉంది. వైరస్ ను అంతం చేసే బుల్లెట్లు మీ రక్తంలోనే ఉన్నాయి. రక్తదానం చేయండి. సీరియస్ గా ఉన్న కరోనా బాధితులను కాపాడండి’ అంటూ అజయ్ దేవ్ గన్ ట్వీట్ చేశారు.

అజయ్ , హృతిక్ లతో పాటు.. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రధాని రిలీఫ్ కేర్ తో పాటు, మహారాష్ట్ర సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందజేస్తున్నారు.

tags :ajay devgan, hrithik roshan, plasma therapy, blood donation, virus killing cells

Advertisement

Next Story

Most Viewed