- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైంగిక వేధింపులు తప్పలేదు: ఐశ్వర్య రాజేష్
విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. టీవీ యాంకర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టిన ఐశ్వర్య.. ‘అవగాళమ్ ఇవర్గలం’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, మళయాళ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ‘కాకా ముట్టై’ సినిమాలో నటనకుగాను విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. ‘కౌశల్య కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్ ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలోనూ కనిపించింది. ఈ మధ్య ఓ టెడెక్స్‌లో పాల్గొన ఐశ్వర్య కెరియర్ ప్రారంభంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది.
తను ఐఐఎమ్ తిరిచ్చిలో జరిగిన ‘టెడెక్స్’ సదస్సులో ప్రసంగించిన వీడియోను ఇటీవలే ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఐశ్వర్య. కెరీర్ ఆరంభంలో తనకు చాలా కష్టాలు ఎదురయ్యాయని అందులో వెల్లడించింది. ‘కుటుంబ భారాన్ని పంచుకోవడానికి సీరియల్స్‌లో నటించడం ప్రారంభించాను. రంగు కూడా తక్కువగా ఉన్నందున ఎవరూ సినిమా అవకాశాలివ్వలేదు. ఎక్స్పోజింగ్ చేయడం నాకు రాదు. ఈ క్రమంలోనే లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నాను. అలా ఎన్నో సినిమాల్లో అవకాశాలు కోల్పోయాను. చాలా కష్టాలు అనుభవించాను. కానీ అట్టకత్తి, కాక ముట్టై సినిమాలు నా జీవితాన్ని మార్చేశాయి’ అని ఐశ్వర్య పేర్కొన్నారు. ప్రస్తుతం ‘తిట్టం ఇరండు’ అనే సినిమాతో పాటు విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న కా పే రణసింగం మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు ఐశ్వర్య.