- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరుసగా నాలుగో నెల అగ్రస్థానంలో ఎయిర్‌టెల్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరోసారి కొత్త యూజర్లను సంపాదించడంలో అగ్రస్థానాన్ని కొనసాగించింది. 2020 నవంబర్ నెలలో కొత్తగా 43 లక్షల మందిని తన నెట్‌వర్క్ పరిధిలోకి రాబట్టుకోవడంతో ఎయిర్‌టెల్ వరుసగా నాలుగో నెల తొలిస్థానంలో నిలిచిందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ఎయిర్‌టెల్ తర్వాత రిలయన్స్ జియో రెండో స్థానంలో ఉందని, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ మాత్రం తమ వినియోగదారులను కోల్పోయినట్టు ట్రాయ్ వెల్లడించింది. చందాదారుల సంఖ్యల వివరలను పరిశీలిస్తే..గతేడాది నవంబర్ చివరినాటికి రిలయన్స్ జియో మొత్తం 40.5 కోట్ల మంది యూజర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 33.4 కోట్లతో రెండో స్థానంలోనూ, వొడాఫోన్ ఐడియా 28.9 కోట్లను, బీఎస్ఎన్ఎల్ 11.8 కోట్లతో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక, ఇదివరకటిలాగే, వొడాఫోన్ ఐడియా తన యూజర్లను ఎక్కువ సంఖ్యలో కోల్పోయింది. కేవలం నవంబర్ నెలలోనే మొత్తం 28.9 లక్షల మందిని వోడాఫోన్ నెట్‌వర్క్ నుంచి బయటకు వచ్చారని ట్రా పేర్కొంది.