- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేలంలో పాల్గొనవద్దు: పైలెట్ యూనియన్లు
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను కాపాడుకునేందుకు అదే సంస్థలోని ఉద్యోగులు ముందుకొచ్చారు. ఉద్యోగులందరూ ప్రైవేట్ ఫైనాన్షియర్‌తో కలిసి సంస్థలోని వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో ఉద్యోగి రూ. లక్ష చొప్పున వేసి బిడ్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కార్పొరేట్ కంపెనీల చరిత్రలో ఇలా ఉద్యోగులే సంస్థను కొనుగోలు చేయడం మొదటిసారి అవుతుంది. ఈ ప్రక్రియ కోసం ఉద్యోగులందరూ ఫైనాన్షియర్‌ను వెతుకుతున్నట్టు సమాచారం.
అయితే, ఓ రెండు పైలట్ యూనియన్లు మాత్రం వేలంలో పాల్గొనవద్దని ఉద్యోగుల కన్సార్టియంకు సూచిస్తున్నాయి. కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ నేతృత్వంలో బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఈ నెల 14న ముగిసే బిడ్డింగ్ ప్రక్రియలో కంపెనీ అధికారులు పాల్గొంటారు. 28లోపు అర్హత కలిగిన బిడ్డర్ల గురించి సమాచారం ఇవ్వనున్నారు. ప్రణాళిక విజయవంతమైతే ఉద్యోగుల కన్సార్టియం ఎయిర్ ఇండియాలో 51 శాతం వాటాను దక్కించుకోవడం, మిగిలిన 49 శాతం వాటా ఫైనాన్షియర్లకు దక్కనుంది.
ఉద్యోగుల దక్కించుకునే 51 శాతం వాటా కోసం ఉద్యోగులూ డాక్యుమెంట్లను ఇవ్వాల్సి ఉంటుందని, కానీ 25 శాతం బకాయిలను యాజమాన్యం పరిష్కరించే వరకు దీనికి అంగీకరించవద్దని ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్(ఐపీసీఏ), ఇండియన్ పైలట్ గిల్డ్(ఐపీజీ) యూనియన్లు ఉద్యోగుల సంఘానికి సూచించింది. ఐదేళ్ల క్రితం అమలు చేసిన 25 శాతం వేతన కోత కారణంగా చెల్లించాల్సిన బకాయిలను ఇవ్వాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం పరిష్కారం అయ్యేదాకా బిడ్ల ప్రక్రియలో పాల్గొనవద్దని యూనియన్లు కోరుతున్నాయి.