- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సిన్ తీసుకున్నారా..? ఇది మీకోసమే : AIIMS
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సందర్భంగా AIIMS (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇటీవల మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు సైతం జారీ చేసింది.
ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు వెంటనే టీకా తీసుకోవాలన్నారు. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే 8 నుంచి 10 నెలల పాటు వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని గులేరియా స్పష్టంచేశారు. దేశంలో తయారైన టీకాల వినియోగం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ అని చెప్పారు. టీకా తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం ఎంటంటే.. కరోనా వెళ్లిపోయిందనే భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉందన్నారు.