తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం.. మంత్రి హెచ్చరిక

by Shyam |   ( Updated:2021-06-28 02:29:16.0  )
Minister Niranjan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. శ్రీశైలం నుంచి 800 అడుల నుంచి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుందని ఆరోపించారు.

వెంటనే కేంద్రం ఇరు రాష్ట్రాల వాటా తేల్చాలని, తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రాంతానికి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. నీటి వనరుల దోపిడి అరికట్టేందుకే బచావత్ ట్రిబ్యునల్ ద్వారా నీటి పంపకాలు చేసి నివేదిక రూపొందించారని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం జూరాలకు కేటాయించిన 17.84 టీఎంసీ‌ల నుంచి నీటిని వినియోగించుకుంటామని ఆయన వివరించారు. బ్యారేజ్ నిర్మాణం చేపట్టి నీటిని నిలుపుకుంటామని, ఏపీ అక్రమ ప్రాజెక్ట్ లు కడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed