‘మిడతల దండు దాడులు చేస్తాయ్.. జాగ్రత్త’

by Shyam |
‘మిడతల దండు దాడులు చేస్తాయ్.. జాగ్రత్త’
X

దిశ, నిజామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మిడతల దండు మహారాష్ట్ర వరకు వచ్చిందని.. ఏక్షణమైనా తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయ అధికారులు మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా రైతులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలోని వార్ధాలో ప్రస్తుతం మిడతల దండు కేంద్రీకృతమైందని, ఇవి గంటకు 5 నుంచి 130 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ విజృంభిస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కనిపించే మిడతలను ఎడారి మిడతలంటారని, పంటలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed