అమ్మిన భూములపై వారసుల పెత్తనం..!

by  |
అమ్మిన భూములపై వారసుల పెత్తనం..!
X

మేడ్చల్ జిల్లాలో రియ ల్ మాఫియా బరితెగించింది. గతంలో అమ్మి న భూములను తిరిగి అప్పనంగా కొట్టేసే కుట్రకు తెరలేపింది. దశాబ్దాల క్రితం వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయించిన భూములపై వారి వారసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రెవెన్యూలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని ప్లాట్లుగా విక్రయించిన భూములను అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి తిరిగి వ్యవ సాయ స్థలాలుగా మార్పిడి చేయించుకున్నారు. రైతు బంధు సైతం తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతున్నారు. వీరికి జిల్లా లోని ఓ కీలక ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వెంచర్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన 390 మంది యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రతాప సింగారంలో చోటుచేసుకున్న భూబాగోతంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

దిశప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మండలంలోని ప్రతాప సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 315,316,317 లో మలిపెద్ది బుచ్చిరెడ్డికి 25.17 ఎకరాల భూమి ఉండేది. 1989లో బుచ్చిరెడ్డి ఈ స్థలంలో 390 ప్లాట్ల తో గ్రామ పంచాయతీ లేఅవుట్ వేశాడు. ఆ లే అవుట్ లోని ప్లాట్లను ప్రాగా టూల్స్ ఉద్యో గులు, ఉస్మానియా దవాఖానలో పని చేసే ఉద్యోగులు కొనుగోలు చేశారు. ప్లాట్ల కోసం తీసుకున్న రుణాలు కూడా క్లియర్ చేశారు. కొనుగోలుదారులు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేసు కుని భవన నిర్మాణాల కోసం 1989 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఈ వెంచర్ లో ముగ్గురు ఇండ్లను కూడా నిర్మించుకున్నారు. మరి కొందరు హద్దులు ఏర్పాటుచేసుకుని బేస్ మెంట్స్ కట్టుకున్నారు. కొంత మంది విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఇద్ద రు, ముగ్గురి చేతులు మారాయి.

ప్లాట్లు వ్యవసాయ భూములుగా..

30ఏళ్ల క్రితం రెసిడెన్షియల్ కోసం మలిపెద్ది బుచ్చి రెడ్డి విక్రయించిన భూములకు వారసు ల పేరుతో కొడుకులు, మనుమళ్లు, కుటుంబ సభ్యులు వివాదాలు సృష్టిస్తున్నారు. తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 2018 ఆగస్టులో మలిపెద్ది శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రతా ప్ రెడ్డి తదితరులు రెసిడెన్షియల్ జోన్ లో ఉన్న 25.17 ఎకరాల స్థలాన్ని వ్యవసాయ భూములుగా మార్పించారు. అప్పటి తహసీల్దార్ తో కుమ్మక్కై అక్రమంగా పట్టదారు పాస్​పుస్తకాలను పొంది రైతు బంధును సైతం రెండేళ్లుగా తీసుకుంటున్నారు.

ప్లాట్ ఓనర్లలంతా భవానీనగర్ అసోసియేషన్ గా ఏర్పడి తమకు న్యాయం చేయాలని అప్పటి కలెక్టర్ ఎంవీ రెడ్డిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ స్పందించి తహసీల్దార్ రాజే శ్వర్ రెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో మరో తహసీల్దార్ విజయలక్ష్మీని నియమించారు. కీసర ఆర్డీఓ రవితోపాటు తహసీల్దార్ విజయలక్ష్మిని విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డీ ఓ, తహసీల్దార్ జరిపిన విచారణలో ఆ భూములను 1989లోనే రెసిడెన్షియల్ ప్లాట్లు గా విక్రయించినట్లు గుర్తించారు.

సమగ్ర నివేదిక రూపొందించి తహసీల్దార్ 2020, జనవరి 3వ తేదీన (ప్రొసీడింగ్ నెంబర్ బి/343/2018) సమర్పించారు. ప్రస్తుతం ఆ వివాదానికి సంబంధించి తుది తీర్పు వెల్లడించే విషయమై కీసర ఆర్డీఓ కోర్టులో ఉంది. ఆర్డీఓ తీర్పును రిజర్వు చేసి పెట్టగా, ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తేవడం.. రెవెన్యూ కోర్టులను రద్దు చేయడంతో బాధితు ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్లాట్ల కోసం అనేక పోరాటాలు చేసి తుది తీర్పు అనుకూలంగా వస్తుందనుకున్న తరు ణంలో కొత్త రెవెన్యూ చట్టం నిరాశ పరిచిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

30ఏళ్ల క్రితం ప్లాటు కొన్నా..

30 ఏండ్ల కిందట ఇక్కడ ప్లాట్ కొన్నా. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సర్పంచ్ గా ఉన్న ప్పుడే ఇంటి పర్మిషన్ తీసుకున్నా. ఇన్నాళ్లు కాస్తులో ప్లాట్స్ అని ఉండేది. సడన్ గా 2018 లో దొంగలకు పాస్ బుక్స్ ఇచ్చారు. ఇది ఎక్కడి న్యాయం. ‌‌

–యాదగిరి, భవానీనగర్ అసోసియేషన్, ప్రతాప సింగారం, ఘట్ కేసర్

ప్రభుత్వ పథకం పక్కదారి..

కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది. ఐనప్పటికీ పాస్ బుక్స్ ఎలా ఇస్తారు. అధికారు లు లంచాలు తీసు కొని కబ్జాదారులకు పాస్ బుక్స్ ఇచ్చా రు. రైతు బంధు, పీఎం కిసాన్ కూడా ఇస్తున్నారు. అధికారులే ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

-ఉపేందర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యుడు, ప్లాట్ ఓనర్

మలిపెద్ది ఫ్యామిలీ లీలలు..

మలిపెద్ది భూ రాబం ధుల ఫ్యామిలీ అది. పేదల భూములు కబ్జా చేశారు. ప్రజాప్రతినిధులుగా పనిచేస్తూ రైతు బంధును తప్పుదోవ పట్టించారు. తహసీల్దార్​ రిపోర్ట్ ఆధారంగా వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించాలి.

– మహేశ్, ప్లాట్ యాజమాని, అసోసియేషన్ సభ్యుడు


Next Story

Most Viewed