- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాల్లో ఎగిరే వడలు.. ఈ హోటల్ స్పెషల్
దిశ, ఫీచర్స్ : ముంబైలోని మంగల్‌దాస్ మార్కెట్‌లో ఉండే ‘శ్రీ బాలాజీ దోశ’ సెంటర్‌లో గాల్లో ఎగిరే దోశలు(దోశ పెనం మీద నుంచి నేరుగా ప్లేట్లో వేయడం) గురించి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఈ దోశ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ కాగా, అలాంటిదే మరొక వీడియో లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈసారి దోశ కాకుండా వడను గాల్లోకి ఎగరేసి తయారు చేయడాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ హోటల్‌లో వడతో పాటు దోశ, ఇడ్లీ, వడాపావ్స్ తదితర టిఫిన్స్ తయారు చేస్తున్నారు.
ముంబైలోని దొరబజార్ వీధిలోని ‘రఘు దోశవాలా’ ఫుడ్ స్టాల్.. గాల్లో ఎగిరే వడల తయారీకి ఫేమస్. ఈ హోటల్‌ను నడిపిస్తున్న 60 ఏళ్ల రఘు వడ తయారు చేస్తుండగా, ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్ అవుతోంది. రఘు యూనిక్ స్టైల్‌లో వడ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మసాలా వడాపావ్ తయారీలో భాగంగా రఘు.. వడను గరిటెతో గాల్లో ఎగరేసి పాన్(కడాయి) మీదకు తీసుకుంటున్న స్టైల్‌కు కస్టమర్లు ఫిదా అవుతున్నారు. కాగా ఈ హోటల్‌లో వడాపావ్ టేస్ట్ సూపర్బ్‌గా ఉంటుదని స్థానికులు చెప్తున్నారు.