- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మిడతల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
by Aamani |
X
దిశ, ఆదిలాబాద్: మిడతల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిడతల దండు అదుపునకు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మహారాష్ట్రలోని వార్దా జిల్లాలో మిడతలు ఉన్నాయని.. అవి ఏ సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివిజన్‌లలో ఒక ఫైర్ ఇంజన్, 5 ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. మిడతలపై పిచికారీ చేసే రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, ఏడిఏలు కోటేశ్వరరావు, వినయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story