- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌పార్టీ బీ ఫాంతో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ రూ.120 కోట్లతో కొన్నదని టీపీసీసీ అధికారి ప్రతినిధి అద్దంకి దయాకర్ఆరోపించారు. పైసలు తీసుకోలేదని మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారా..? అంటూ ఆయన కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సవాల్‌విసిరారు. కాంగ్రెస్‌పార్టీ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు మీ రెన్ని ప్రయత్నాలు చేసినా అది కలగానే మిగులుతుందన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. నీతి, నిబద్ధత లేని గండ్ర వెంకట రమణారెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్కార్యకర్తలెవ్వరూ భయపడరని తేల్చిచెప్పారు. నీకు దమ్ముంటే ఇసుక, భూ దందాల్లో హాస్తం లేదని నిరూపించుకో? అని గండ్ర వెంటకరమణారెడ్డిని ఉద్దేశించి అన్నారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌పార్టీ కట్టుబడి ఉందన్నారు. చర్చకు ఎక్కడికి రమ్మన్నా.. వస్తామని అద్దంకి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌పార్టీ శ్రమ, ఓట్లతో గెలిచిన నీవు బుద్ది లేకుండా మాట్లాడకని గండ్రపై తీవ్రస్థాయి మండిపడ్డారు.
నీ రాజకీయ అవకాశవాదానికి చరమగీతం పాడతామన్నారు. టీఆర్ఎస్పార్టీ ఓట్లు దండుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇప్పటికే కార్యకర్తలను కంట్రోల్చేసేందుకు సుమారు రూ.73 కోట్లు ఖర్చుపెట్టగా, ఎన్నడూ లేని విధంగా రూ.250 కోట్ల నిధులను కార్యకర్తలను తరలించేందుకు ఖర్చుపెట్టారన్నారు. ఒకవేళ దళిత బంధు పూర్తి చేస్తే దాని కొరకు మరో రూ. 2 వేల కోట్లు ఖర్చు అయ్యేవని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్‌పార్టీ సభ పెడితే కార్యకర్తలు స్వచ్ఛందంగా గజ్వేల్‌లో కదం తొక్కారని గుర్తుచేశారు. అతిత్వరలో టీఆర్‌ఎస్‌పార్టీని అడ్రస్‌లేకుండా చేస్తామని వివరించారు.