- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చండి.. ప్రధానికి చంద్రబాబు లేఖ
దిశ, ఏపీ బ్యూరో: వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి/బోయలు పేదరికంతో బాధపడుతున్నారని లేఖలో తెలిపారు. ఈ వర్గాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని.. 2016లో, ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకీ/ బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. విస్తృతమైన ఫీల్డ్ వర్క్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు చేసిన వివరణాత్మక పరిశోధన తర్వాత, వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంలో జాప్యం జరిగిందని కమిటీ గుర్తించిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటించి వాల్మీకులు/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది. వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను లేఖలో ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. 1961 లో సెన్సస్ కమిషన్‌కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రర్ జనరల్ రాయ్ బర్మన్ వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేశారు. అలాగే 1961-62లో ఏపీ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిషన్ వాల్మీకి/బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని సూచించింది. ఆ తర్వాత అనంతరామ కమిషన్ అనుకూలమైన సిఫార్సులు చేసింది. అయినప్పటికీ వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదని’ చంద్రబాబు తెలిపారు. ‘రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రలోని వాల్మీకి/బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964 లో ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 1968లో వాల్మీకులు/బోయలను ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు.
దురదృష్టవశాత్తు, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకులు మాత్రమే ఎస్టీ జాబితాలోకి వస్తారని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 1977 జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. వాల్మీకి/బోయలపై వివిధ కమిటీలు గతంలో చేసిన సిఫారసులను నాటి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇది పశ్చిమ కనుమలు, ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే బోయల మధ్య విభేదాలకు దారితీసింది. 1991లో భారత ప్రభుత్వం వాల్మీకులు మరియు నాయక్, నాయక, బేడా, బేడార్ మొదలైన ఉప సమూహాలను ఎస్టీ జాబితాలో చేర్చింది. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకులు/బోయలు సాంప్రదాయకంగా బలమైన సామాజిక, వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నారు. కర్ణాటకలో వీరిని ఎస్టీ జాబితాలో చేర్చారు. కానీ ఏపీలో వాల్మీకులు/బోయల స్థితి గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించడానికి ప్రయత్నించి వాల్మీకులు/బోయలను భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. డిసెంబర్ 01, 2017న ఏపీ కేబినెట్ వాల్మీకీ/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది’ అని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. వాల్మీకులు/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన సందర్భాన్ని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత ప్రభుత్వం వద్ద బిల్లు పెండింగ్..
తెలుగుదేశం ప్రభుత్వం ఈ తీర్మానాలన్నింటినీ క్రోడీకరించి 15 డిసెంబర్ 2017 న భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది. తరువాత, భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరిన్ని వివరాలను కోరగా సెప్టెంబర్ 5, 2018 న నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వివరాలను పంపడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రతిపాదన భారత ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. వాల్మీకీ/ బోయల దశాబ్దాల పోరాటానికి సంఘీభావంగా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉంది. వారి న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చాలని వారి తరపున, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. గత మూడేళ్లుగా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోవడంతో నేను మీకు ఈ వివరణాత్మక అభ్యర్థనను పంపుతున్నాను. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఈ అభ్యర్థనకు మీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాను. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులు/బోయలను ఎస్టీలుగా గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను అని లేఖలో చంద్రబాబు మోడీని కోరారు.