- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రీన్ ఎనర్జీ రంగంలో అతిపెద్ద ఒప్పందం!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ఒప్పందం జరిగింది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్‌బీ ఎనర్జీ ఇండియాలోని 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దేశీయ అదానీ గ్రీన్ ఎనర్జీ ఒప్పందం చేసుకుంది. ఎస్‌బీ ఎనర్జీలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 80 శాతం వాటా, సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ గ్రూపునకు చెందిన 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం సంతకాలు జరిగాయని అదానీ సంస్థ తెలిపింది. అలాగే, ఈ ఒప్పంద పోర్ట్‌ఫోలియోలోని ఆస్తులు ప్రధానంగా సోలార్ పార్క్ ఆధారిత ప్రాజెక్టులే అని అదానీ గ్రీన్ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం వంద శాతం వాటా కోసం అదానీ గ్రీన్ ఎనర్జీ 3.5 బిలియన్ డాలర్లు(రూ. 25.6 వేల కోట్లు) చెల్లించినట్టు తెలుస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగానికి సంబంధించి భారత్‌లో జరిగిన అతిపెద్ద ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ ఒప్పందం సందర్భంగా మాట్లాడిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. సాఫ్ట్‌బ్యాంక్, భారతీ గ్రూప్ ఆస్తుల నాణ్యత ‘అద్భుతమైనది’. దీన్ని భవిష్యత్తు అవసరాలకు తీసుకెళ్లే అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు.