కరోనా నుంచి నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి

by Shyam |   ( Updated:2020-07-14 00:51:58.0  )
కరోనా నుంచి నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఎవ్వరినీ కూడా వదలడంలేదు. ప్రముఖ బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతోపాటు పలువురు నటీనటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటి రాచెల్ వైట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. గత కొద్దిరోజుల నుంచి ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నది. ఈ తరుణంలో ఆమె కరోనా టెస్టులు చేయించుకుంది. దీంతో ఆ టెస్టుల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె కోలకతాలోని తన నివాసంలో హోం క్వారంటైన్ లో ఉందంట. ఈ సందర్భంగా తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను ఆమె ట్విట్టర్ ద్వారా కోరింది. అయితే ఈ నటి హర్ హర్ బ్యోమ్ కేష్, థాయ్ కర్రీ తోపాటు పలు చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించికున్నది.

Advertisement

Next Story

Most Viewed