కొవిడ్ పేషెంట్లతో స్టార్ కపుల్స్ డ్యాన్స్.. వీడియో వైరల్

by Jakkula Samataha |   ( Updated:2021-06-01 04:54:25.0  )
కొవిడ్ పేషెంట్లతో స్టార్ కపుల్స్ డ్యాన్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: కన్నడ హీరో భువన్ పొన్నన్న, హీరోయిన్ హర్షిక పొన్నన్న కరోనా సమయంలో బాధితులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. భువనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బస్, ఫ్రీ ఆటో అంబులెన్స్, టాక్సీ సర్వీస్ స్టార్ట్ చేసిన కపుల్స్.. కొవిడ్ పేషెంట్లలో పాజిటివిటీని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక మడికెరిలోని ఓ హాస్పిటల్‌ను సందర్శించారు. అక్కడి రోగులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఇద్దరు.. పేషెంట్ల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు వారితో కలిసి డ్యాన్స్ చేశారు.

కొడగు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతితో కొవిడ్ పేషెంట్స్‌ను కలిసిన స్టార్ కపుల్స్.. రోగులపై వివక్ష చూపకూడదని తెలిపేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. సంక్షోభ సమయంలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందామని పిలుపునిచ్చారు. కరోనా పేషెంట్లు చాలా మంది మానసికంగా బలహీనంగా ఉన్నారని.. వారిలో ధైర్యం, విశ్వాసం నింపేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు.

Advertisement

Next Story