పొద్దున అక్షయ్.. ఇప్పుడు గోవిందా..

by Jakkula Samataha |
పొద్దున అక్షయ్.. ఇప్పుడు గోవిందా..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడినట్లు ఇవాళ ఉదయం బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ప్రకటించగా.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నా. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి వైద్యుల సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నా. త్వరలో కోలుకుని తిరిగివస్తా’ అని గోవిందా తెలిపారు.

Advertisement

Next Story