ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు : ఆర్ నారాయణ మూర్తి

by srinivas |   ( Updated:2021-02-14 08:13:15.0  )
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సరికాదు : ఆర్ నారాయణ మూర్తి
X

దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఏపీలో రాజకీయ ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి స్పందించారు. ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదికలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమని అభివర్ణించారు.

ప్రభుత్వ సంస్థలన్నింటినీ కేంద్రం ప్రైవేటీకరించడం సరికాదని, సొంత గనులు కేటాయించకుండా ఫ్యాక్టరీకి నష్టాలు వస్తున్నాయని చెప్పడం మంచిదికాదన్నారు.32 మంది ప్రాణత్యాగాల ఫలమే స్టీల్ ప్లాంట్అని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాని మోడీ ఉపసంహరించుకోవాలని ఆర్ నారాయణమూర్తి కోరారు. లేనియెడల ఏపీలో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం హోరెత్తుతుందని ఆయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed