- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వామన్ రావు మర్డర్ కేస్ .. ఆడియో లీక్‌పై పోలీసుల వివరణ
by Sridhar Babu |

X
దిశ ప్రతినిది, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో జరిగిన వామన్ రావు దంపతులు హత్యపై సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో అంతా వట్టిదేనని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మంథనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పోతారం సర్పంచ్ భర్త సదానందం, కాంగ్రెస్ నాయకుడు మూల పురుషోత్తం రెడ్డిలు తాగిన మైకంలో మాట్లాడారన్నారు. వీరిద్దరిని విచారించడం జరిగిందని, వారు తాగిన మైకంలోనే మాట్లాడామని ఒప్పుకున్నారని ఏసీపీ వివరించారు. అయితే వారిద్దరిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. విచారణలో ఉన్న కేసు విషయంలో ప్రజలను, పోలీసులను తప్పుదోవ పట్టించారని ఏసీపీ అన్నారు.
Next Story