- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఏసీపీల బదిలీలు..
దిశ,వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీగా ఏసీపీల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో 15 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆకుల శ్రీనివాస్‌ను కాచీగూడ ఏసీపీగా బదిలీ చేశారు. సంగారెడ్డి పోలీసు శిక్షణా కేంద్రంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గిరి కలాకోటను వరంగల్ తూర్పు ఏసీపీగా బదిలీ చేశారు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ బాలాజీని ఎస్డీపీవో సంగారెడ్డిగా బదిలీ అయ్యారు. కాగా ఎస్డీపీవో సంగారెడ్డిలో పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డిని ఎల్బీ నగర్ ఎసీపీగా నియమించారు.
ఎల్బీ నగర్ ఏసీపీ పృథ్వీ కుమార్‌ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఏసీపీ భీం రెడ్డి పటాన్ చెరువు ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఇంటలిజెన్స్ డీఎస్పీ సుదర్శన్‌కు బంజారాహిల్స్ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస రావును ఇంటలిజెన్స్ డీఎస్పీగా నియమించారు. రామగుండం ఏసీపీ పీవీ గణేశ్ పంజాగుట్ట ఏసీపీగా వెళుతున్నారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్నను ఇంటలిజెన్స్ డీఎస్పీగా, వెయిటింగ్ లిస్టులో ఉన్న డీఎస్పీ రామేశ్వర్‌ను ఏసీపీ సిద్దిపేటగా పోస్టింగ్ ఇచ్చారు. సిదిపేట ఏసీపీ విశ్వ ప్రసాద్‌ను డీజీపీ ఆపీస్ లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఇంటలిజెన్స్ డీఎస్పీ వి.భాస్కర్‌ను ఏసీపీ శంషాబాద్, సీసీఎస్ ఏసీపీ జైపాల్ రెడ్డిని ఎస్డీపీవో బాన్సు వాడకు ట్రాన్స్ ఫర్ చేశారు. బాన్సువాడ ఎస్డీపీవోలో పనిచేస్తున్న దామోదర్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.