- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాం
దిశ, నిర్మల్: తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కూడలిలో ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, అధికారులు, టీఆర్ఎస్ నేతలలు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, తెలంగాణ విముక్తికి అవిశ్రాంత పోరాటం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులకు అండగా నిలిచి స్ఫూర్తినిచ్చిన ఉద్యమ నాయకుడని అన్నారు. న్యాయవాదిగా, శాసన సభ్యుడిగా, మంత్రిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా బాపూజీ సేవలు మరువరానివని ప్రశంసించారు.