- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామన్‌రావు హత్య కేసు.. జైలుకెళ్లిన నిందితులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: వామన్ రావు, నాగమణి హత్య కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఫిబ్రవరి 17న జరిగిన హత్య ఘటనలో కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్ ను ఏడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ మంథని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు హత్య జరిగిన తీరుపై నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. సీన్ రీ కన్స్ స్ట్రక్షన్ చేసిన పోలీసులు మంథని కోర్టు నుంచి కల్వచర్ల వద్ద జరిగిన మర్డర్ స్పాట్ వరకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ తీసుకున్నారు..? బిట్టు శ్రీను వాహనం తీసుకున్నదెక్కడ, వామన్ రావు కారును వెంబడించింది ఎవరు? అన్న వివరాలను సేకరించారు. అలాగే మర్డర్ స్పాట్ ను ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? హత్యలో పాల్గొన్నది ఎంతమంది? ఇందుకు సహకరించిన వారెవరు? అన్న వివరాలను కూడా పోలీసులు నిందితుల నుంచి సేకరించారు.
అలాగే మర్డర్ కోసం ఉపయోగించిన కత్తలను సీడైవర్స్ సాయంతో సుందిళ్ల బ్యారేజ్ నుంచి సేకరించి ఫోరెన్సిక్ లాబోరేటరికి పంపించారు. హత్య చేయడానికి నిందితుల ప్రమేయం మాత్రమే ఉందా? లేక వేరే వారికి సంబంధం ఉందా? అన్న కోణంలో ప్రశ్నించినట్టు సమాచారం. ఘటనకు సంబందించిన వివరాలు సేకరించిన పోలీసులు కస్టడీ ముగియడంతో గురువారం మంథని కోర్టులో హాజరు పర్చి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మరో వైపు ఏ4 నిందితునిగా ఉన్న బిట్టు శ్రీను కస్టడీ కొనసాగుతోంది. అతన్ని కూడా వివిధ కోణాల్లో పోలీసులు ప్రశ్నించనున్నారు.