- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం
by Sumithra |

X
దిశ, అమరావతి బ్యూరో: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సమీపంలోని కడప రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. తాడిపత్రి నుంచి వరిపొట్టు లోడుతో వెళ్తున్న లారీ, కడప వైపు నుంచి నల్లబొగ్గు లోడ్‌తో తాడిపత్రి వైపు వస్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బొగ్గు లారీ డ్రైవర్ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నిషార్ సజీవదహనమయ్యాడు. మరో లారీలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు గంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అనంతరం క్షతగాత్రులను బయటకు తీసి తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. దీంతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Next Story