అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ACB దాడులు..

by Sumithra |   ( Updated:2020-09-09 00:52:41.0  )
అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ACB దాడులు..
X

దిశ, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. జిల్లాలోని నర్సాపూర్ మండలానికి చెందిన మూర్తి అనే వ్యక్తికి 112 ఎకరాల పొలం ఉంది. దానికి సంబంధించి NOC ఇవ్వడానికి అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో పాటు మరికొంత మంది రెవెన్యూ సిబ్బంది రూ. 1 కోటి 20లక్షలు డిమాండ్ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఈ నేపథ్యంలోనే సెంట్రల్ యూనిట్ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం సుమారు 20మంది ACB అధికారులు మాచవరం గ్రామంలోని అడిషనల్ కలెక్టర్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లు, అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు లభ్యమైనట్లు రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారుల బృందం ఏకకాలంలో మరో 12చోట్ల దాడులు నిర్వహిస్తోంది. అడిషనల్ కలెక్టర్ నగేష్‌కు చెందిన లాకర్ బోయినపల్లిలో ఉందనే సమాచారంతో నగేష్ కుటుంబీకులను అక్కడికి తీసుకువెళ్లి దానిని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed