- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుక్ తనయుడి పుట్టినరోజు వేడుకలు ఇలా…
అబ్రమ్.. బాలీవుడ్ బాద్ షా చిన్న కొడుకు. మామూలుగా అయితే సెలెబ్రిటీల పిల్లలకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అబ్రమ్ విషయానికి వస్తే అది ఇంకొంచెం ఎక్కువే. తండ్రికి ఫేవరేట్ కొడుకు అయిన ఈ బుల్లి సెలబ్రిటీ ఫ్యాన్స్ కు వెరీ వెరీ స్పెషల్. ఈ మధ్య కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో విరాళాలు సేకరించేందుకు ఐ ఫర్ ఇండియా లైవ్ కన్సర్ట్ లోనూ తండ్రితో కలిసి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు జూనియర్ కింగ్ ఖాన్.
మే 28న తన పుట్టినరోజు కావడంతో ఎప్పటి లాగే భారీ సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకున్నా.. కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నామంటూ అబ్రం తల్లి గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తన ఫేవరేట్ పర్సన్ అయిన తండ్రి షారుక్.. ఫేవరేట్ స్కారీ కథలు చెప్తుండగా.. ఫేవరేట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ.. అబ్రం తన ఏడో పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు తెలుపుతూ వీడియో సెండ్ చేసింది గౌరీ ఖాన్.
దీంతో సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అందమైన అబ్రం హ్యాపీ బర్త్ డే అంటూ.. మలైకా అరోరా, మనీష్ మల్హోత్రా, మీరా కపూర్ లాంటి సెలబ్రిటీలు స్పెషల్ విష్ చేశారు.