- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాయు కాలుష్యంతోనూ అబార్షన్!
దిశ, వెబ్‌డెస్క్ : మాతృత్వం అనేది ప్రతి గృహిణిని అమితంగా సంతోషపెట్టే విషయం. తన ప్రాణాలను పణంగా పెట్టైనా మరొకరికి జీవం పోస్తోంది. అమ్మ తనానికి మించిన పదం ప్రపంచంలో మరొకటి లేదనేది జగమెరిగిన సత్యం. గర్భం దాల్చిన రోజు నుంచి పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటుంది. మరి ఎన్నో ఆశలు పెంచుకున్న బిడ్డ కడుపులోనే చనిపోతే.. ఆమె గర్భశోకం వర్ణించలేం. అయితే గర్భస్రావాలు గాలి కాలుష్యంతో కూడా జరుగుతాయని మీకు తెలుసా..? ఇంతకు ఈ అబార్షన్లు ఎక్కడ జరుగుతున్నాయి..? ఎలా అవుతున్నాయో తెలుసుకుందాం..
భారతదేశంలో భారీ, మధ్య తరహ, చిన్న పరిశ్రమలు లక్షల్లో ఉంటాయి. వీటి నుంచి వెలువడే కాలుష్యంతోపాటు వాహన పొల్యూషన్‌తో ఇప్పటికే వందల రోగాలు మనిషిని చుట్టుముట్టాయి. ఇవి చాలవన్నట్లు ఈ కాలుష్యం వల్ల గర్భాలు సైతం పోతున్నాయి. కడుపులోని బిడ్డ భూమి మీదికి రాకముందే కాలుష్యం కాటేస్తోంది. దీనిపై చైనాకు చెందిన పెకింగ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. దక్షిణ ఆసియాలో ఎక్కువగా జరుగుతున్న ఈ గర్భస్రావాలపై ఆ యూనివర్సిటీ పలు సంచలన విషయాలను వెల్లడించింది.
పెకింగ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం అధ్యయన ప్రధాన రచయి టావో జు పేర్కొన్న నివేదిక ప్రకారం.. దక్షిణ ఆసియాలోని ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. ఈ దేశాల్లో గాలి కాలుష్యం వల్ల అబార్షన్ల శాతం భారీగా పెరిగిందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇండియాలో గాలి నాణ్యత ప్రమాణం 40 ug/m3ని మించి PM 2.5 కణాలకు పెరగడం వల్ల దక్షిణ ఆసియాలో ఏడాదికి 3,49,681 అబార్షన్లు జరుగుతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇది ఆందోళనకరమైన అంశమని విచారం వ్యక్తం చేసింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో పోల్చితే మనదేశంలో అత్యధికంగా 77 శాతం గర్భస్రావాలు వాయు కాలుష్యంతోనే జరుగుతున్నాయని వెల్లడైంది. 2000 నుంచి 2016 సంవత్సరం వరకు వార్షిక గర్భధారణ నష్టంలో ఏడు శాతం నమోదైనట్లు తాజా నివేదికలో వివరించింది.
వాయు కాలుష్యంతో జరుగుతున్న అబార్షన్లలో ఇండియా తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్‌లో 12 శాతం, బంగ్లాదేశ్‌లో 11 శాతంగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిబంధనల ప్రకారం గాలి నాణ్యత మార్గదర్శకం ప్రకారం 10 ug/m3 ఉండాలి. కానీ దాని కంటే ఎక్కువగా ఉండే వాయు కాలుష్యంతో దక్షిణ ఆసియా దేశాల్లో 29 శాతం అబార్షను అవుతున్నట్లు ఆ అధ్యయనంలో పేర్కొన్నారు.