ఇప్పుడు బీపీ డ్రాప్.. రేపు చావేలే : నటి భర్త 

by Shyam |
ఇప్పుడు బీపీ డ్రాప్.. రేపు చావేలే : నటి భర్త 
X

దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ శ్వేతా తివారీ బ్లడ్ ప్రెషర్ డ్రాప్ కావడంతో హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఈ న్యూస్ స్ప్రెడ్ అవడంతో శ్వేత ఎక్స్ హజ్బెండ్ అభినవ్ కోహ్లీ సోషల్ మీడియాలో స్పీడీ రికవరీ పోస్ట్ పెట్టాడు. ఈ సంగతి పక్కనబెడితే వీరిద్దరి మధ్య సరైన రిలేషన్ లేకపోవడంతో పాటు కొడుకు రియాన్ష్ కస్టడీ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్వేతను విమర్శించేందుకు ప్రజెంట్ చాన్స్‌ను మిస్ చేసుకోని అభినవ్.. ఆమె బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి పోస్ట్‌లో మెన్షన్ చేశాడు.

‘కొడుకును నా దగ్గరికి చేర్చుకునేందుకు శ్వేతతో కోర్టులో ఫైట్ చేయడం సెపరేట్ ఇష్యూ. కానీ ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు, వారి నుంచి మ్యాగ్జిమమ్ లవ్ పొందేందుకు యాక్టర్స్ ఆరాటపడుతుంటారు. తమను తాము మోస్ట్ బ్యూటిఫుల్‌గా ప్రజెంట్ చేసుకునే క్రమంలో ఎక్స్‌ట్రీమ్ లెవల్‌కు వెళ్లిపోతారు. తక్కువగా తింటూ శరీరానికి ఒత్తిడి కలిగిస్తారు. ఇలా చేయడం వల్ల చివరికి ఒక రోజు వారి గుండె కూడా అలిసిపోతుంది’ అని పోస్ట్ పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed