అమీర్ ఖాన్ కూతురికి లైంగిక వేధింపులు

by Shyam |   ( Updated:2020-11-03 01:04:50.0  )
అమీర్ ఖాన్ కూతురికి లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్ : సెలబ్రిటీల లైఫ్‌స్టైల్ గురించి మనకు కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సొసైటీలో గౌరవం, ఫ్యాన్ ఫాలోయింగ్, రిచ్‌నెస్‌తో పాటు ప్రతీ క్షణం జాయ్‌‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారని అనుకుంటాం. ఇక వాళ్ల పిల్లల విషయానికొస్తే గోల్డెన్ స్పూన్‌తో పుట్టారురా బాబు! వాళ్లకేం.. కారు, డబ్బు, షాపింగ్, పబ్‌లు, రెస్టారెంట్లలో సూపర్‌గా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది. కానీ బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ స్టోరీ వింటే మాత్రం.. వీరి లైఫ్‌లోనూ ఇన్ని కష్టాలుంటాయా? అనిపిస్తుంది. తను కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లో ఉన్నానని, ట్రీట్‌మెంట్ ద్వారా ఈ బాధ నుంచి బయటపడ్డానని ఈ మధ్యే తెలిపిన ఐరా.. తాజాగా తను చిన్నతనంలో లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొన్నానని బాధపడింది. 14 ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని, కానీ అప్పుడు తను ఏం చేస్తున్నాడో తెలిసేది కాదని చెప్పింది. ఏడాది తర్వాత కానీ విషయం అర్థం కాలేదని, దీంతో అప్పటికే విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న తల్లిదండ్రులకు మెయిల్ ద్వారా విషయాన్ని తెలిపి, వారి సహాయంతో ఆ సమస్య నుంచి బయటపడగలిగానని చెప్పింది. కానీ ఈ ఘటన కూడా తనపై పెద్దగా ప్రభావం చూపలేదంది ఐరా.

బాల్యంలో క్షయ వ్యాధి వచ్చినా భయపడలేదని.. అప్పుడు అమ్మానాన్న తనతో పాటే ఉన్నారని, వాళ్లు విడిపోయినప్పుడు కూడా తను అంతగా బాధపడలేదని.. ఎందుకంటే తాను అప్పుడు చాలా చిన్నపిల్లనని చెప్పుకొచ్చింది ఐరా. కానీ మెంటల్‌గా ఎందుకు అప్‌సెట్ అయ్యిందో, దేని గురించి ఒత్తిడికి లోనై గదిలో ఒంటరిగా బాధపడుతూ ఉండేదో మాత్రం వెల్లడించలేదు.

Advertisement

Next Story