సహజీవనం చేసి.. డబ్బులు తీసుకోమన్నాడు.. ఓ యువతి ప్రేమకథ

by Sampath |   ( Updated:2021-05-09 04:36:53.0  )
సహజీవనం చేసి.. డబ్బులు తీసుకోమన్నాడు.. ఓ యువతి ప్రేమకథ
X

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి మీద అతనికి కలిగి వ్యామోహం ప్రేమగా మార్చాడు. అమ్మాయిని ప్రేమలో దింపాడు. ప్రతి జన్మలోను నువ్వే నా భాగస్వామివని నమ్మబలికాడు. మనం పెళ్లి చేసుకుందాం అని ఆ అమ్మాయిని నమ్మించాడు. దీంతో అతని ప్రేమ నిజమని నమ్మిన ఆ అమ్మాయి అతనితో ప్రేమలో పడిపోయింది. జీవితాతం తనతో నే కలసి ఉంటానని నమ్మింది. అలా ఆ అబ్బాయిని నమ్మిన ఆమె తనతో కొన్ని నెలలు సహజీవనం చేసింది. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో.. అనుకోకుండా ఓ ఇబ్బంది వచ్చింది. దీంతో అబ్బాయి అసలు స్వరూపం బయటపడింది.

వివరాలప్రకారం.. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంకు చెందిన మాల్యాద్రిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి బి.ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మండల కేంద్రమైన కోయలకుంట్ల గ్రామానికి చెందిన దళిత యువతి కూడా బి.ఫార్మసీ పూర్తి చేసి అదే కంపెనీలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ ఏర్పడిన పరిచయం కాస్తా, ప్రేమగా మారింది. బ్రహ్మారెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కొన్ని రోజులు తనతో సహాజీవనం కూడా చేసింది.

అయితే అమ్మాయి వారి ఇంటిలో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. దీంతో ఆమె అబ్బాయిని కలిసి మనం పెళ్లి చేసుకుందాం మా ఇంట్లో వారు నాకు వేరే సంబధం చూస్తున్నారని చెప్పింది. దానికి సమాధానంగా అతను అమ్మాయి సామాజిక వర్గం వేరు కావడంతో నిన్ను పెళ్లిచేసుకోవడాని అమ్మనాన్న ఒప్పుకోరు అని చెప్పి వెళ్లి పోయాడు. దీంతో ఆమె జిల్లా జడ్చర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు బ్రహ్మారెడ్డిని, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పుడు బ్రహ్మీరెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి బెంగుళూరుకు వెళ్లి పోయాడు. దీంతో ఆమె ఆ ఊరి గ్రామపెద్దలతో విషయం చెప్పగా వారందరూకలసి అబ్బాయితో మాట్లాడారు. వారి మాటలకు సమాధానంగా బ్రహ్మారెడ్డి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోను కావలంటే కొంత డబ్బు ఇస్తాను అని చెప్పడంతో యువతి అక్కడే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె కోలుకుని ఇంటికి వెళ్లింది. జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైనందున అక్కడి నుంచే న్యాయపోరాటం చేస్తామని ఆ యువతి బంధువులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed