- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కృష్ణనదిలో యువకుడు గల్లంతు
దిశ, అలంపూరు: తాత మరణించిన తర్వాత ఆయన అస్థికలను నదిలో నిమజ్జనం చేసేందుకు వచ్చిన ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిన సంఘటన బీచుపల్లీ వద్ద కృష్ణానదిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతంకు చెందిన ఓ కుటుంబం అస్థికలను నదిలో నిమజ్జనం చేసేందుకు బుధవారం బీచుపల్లీకి చేరుకున్నారు. ప్రవేటు వాహనంలో ఒకే కుటుంబంకు చెందిన 20 మంది వరకు వచ్చారు. నది ఒడ్డున పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం అస్థికలను నది నీటిలో నిమజ్జనం చేశారు. అనంతరం పుష్కర ఘాట్లో కుటుంబ సభ్యులు స్నానం చేస్తున్న సమయంలో ఓ యువతి నది నీటిలో మునిగి నది ప్రవహంలో కోట్టుకపోతుండగా యువతి అన్న అమేను రక్షించేందుకు వెళ్లాడు, అంతలోనే అక్కడే ఉన్న జాలర్లు పుట్టి ద్వారా వెళ్లి అమేను కాపాడారు. యువతి అన్న కార్తీక్ (27) నది నీటిలో మునిగి పోయాడు. అతన్ని రక్షించేందుకు మరో ముగ్గురు వ్యక్తులు నీటిలోకి వెళ్లారు. మళ్ళీ జాలర్లు కార్తీక్ ను నీటి ప్రవహంలో కోట్టుకపోతున్న ముగ్గురు యువకులను పుట్టి ద్వారా రక్షించారు. అప్పటికే కార్తీక్ మృతి చెందాడు.