- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
దిశ, వెబ్‌డెస్క్: సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు కాలుజారి జలపాతంలో పడటంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంద్రవెల్లికి చెందిన సచిన్ ఇంటర్‌వరకు చదివి.. టీ షాప్ నడిపిస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఆరునెలల క్రితం తండ్రి పాముకాటుతో చనిపోయాడు. నిన్న రాఖీ పండగ సందర్భంగా సెలవు కావడంతో టీ షాపును మూసి స్నేహితులతో కలిసి ఖండాల జలపాతం దగ్గరకు వెళ్లాడు.
జలపాతం అందాలను వీడియో తీస్తూ ఇదే క్రమంలో సెల్పీ దిగే సమయంలో కాలుజారి అందులో పడిపోయాడు. ఈ ఘటన మొత్తం అతని స్నేహితులు తీసిన మరో ఫోన్‌లో రికార్డు అయ్యింది. సోమవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చేపట్టిన పోలీసులు మంగళవారం మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరునెలల వ్యవధిలోనే భర్త, కొడుకు చనిపోవడంతో.. సచిన్ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కావట్లేదు.