కబడ్డీ ఆటలో విషాదం.. కూతకు వెళ్లి గుండెపోటుతో మృతి

by srinivas |
కబడ్డీ ఆటలో విషాదం.. కూతకు వెళ్లి గుండెపోటుతో మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంగన్నపల్లిలో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన కబడ్డీ పోటీలో కూతకు వెళ్లిన ఓ యువకుడు కుప్పకూలి చనిపోయాడు. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం కొండపేటకు చెందిన నరేంద్ర ఎం.కామ్ పూర్తి చేశాడు. పండగ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. అయితే కబడ్డీ కూతకు వెళ్లిన సమయంలో ప్రత్యర్థి జట్టులోని సభ్యులు నరేంద్రను కిందపడేసి ఒక్కసారిగా మీదపడ్డారు. ఆ తర్వాత పైకి లేచిన నరేంద్ర వెంటనే కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed