- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. వైద్యపరీక్షతో షాకైన భర్తలు
దిశ, వెబ్‌డెస్క్ : గతంలో మహిళలు ఒక్క పెళ్లికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే అది తప్పుగా భావించేవారు. కానీ ఇప్పడు ట్రెండ్ మారింది. ఓ మహిళ 9 మందిని పెళ్లి చేసుకుని ట్రెండ్ సెట్ చేస్తోంది. హరియాణా రాష్ట్రం కైతల్ జిల్లాకు చెందిన ఓ మహిళ తొమ్మిది మందిని పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ఆ తొమ్మిది మందిని కూడా ఆమె ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈమెను పెళ్లి చేసుకున్న పాపానికి ఇప్పుడు ఆ తొమ్మిది మందిని భయం వెంటాడుతోంది. ఇంతకీ పెళ్లి చేసుకున్నవారిని ఇబ్బందుల్లోకి నెట్టడం ఏంటీ, ఆ మాయ లేడి ఎవరూ అనుకుంటున్నారా..
పెళ్లి కావాల్సిన యువకులు, భార్యల నుంచి విడిపోయిన వ్యక్తులను టార్గెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తుంది ఓ మహిళ. ప్రేమతో వారిని మాయలోకి దింపి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులు వారితో ఆనందంగానే ఉంటుంది. ఇక పెళ్లై పదిహేను రోజులు గడిచింది అంటే చాలు గొడవలు మొదలవుతాయి. ఎలాంటి గొడవలు లేకున్నా.. ఏదో ఒక గొడవ తానే క్రియేట్ చేసి విడాకులు ఇవ్వాలని, విడాకులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేది. ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా తొమ్మిది మందిని పెళ్లి చేసుకుని వారికి విడాకులు ఇచ్చింది. కానీ, ఎంత దాచాలని చూసిన ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి పోలీసులకు చిక్కాల్సిందేగా. అలా ఆమె 9వ పెళ్లి చేసుకుంటుండగా పోలీసులు ప్రత్యేక్షమయ్యారు. పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి ఆమె గతంలో చేసిన ఘనకార్యం గురించి చెప్పారు. మహిళను అదుపులోకి తీసుకోని స్టేషన్‌కి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో హెచ్‌ఐవీ ఎయిడ్స్ నిర్దారణ అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్న 8 మంది భయంతో వణికిపోతున్నారు. తమకు వైరస్ సోకే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా పోలీసులు పరీక్షలు చేయించనున్నారు. ఈమె వలన ఆ తొమ్మిది మంది కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.