- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దుబాయ్ నుంచి నా భర్తను రప్పించండి’
దిశ, జగిత్యాల: వీసా లేకుండా మస్కట్ నుంచి దుబాయ్‌కి వెళ్లిన తన భర్తను తిరిగి ఇండియాకు రప్పించాలని ఓ మహిళా జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను వేడుకుంది. పనిలేక, ఆహారం దొరకక అవస్థలు పడుతున్న తన భర్తకు పాస్ ఔట్ వీసా ఇప్పించి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ను కోరింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన ముల్కల సత్యం 2016లో ముంబాయి నుంచి మస్కట్‌కు జాబ్ వీసాపై వెళ్లగా.. అక్కడి నుంచి దుబాయ్‌కి అక్రమంగా వెళ్లాడని ఆయన భార్య జ్యోతి వివరించింది.
అయితే కరోనా కారణంగా దుబాయ్‌లో చిక్కుకున్న తన భర్తకు తినడానికి తిండి కూడా లేదని వాట్సప్ ద్వారా సమాచారం అందించాడని తెలిపింది. స్వగ్రామంలో కూడా ఆస్తులు కూడా లేకపోవడంతో లేబర్‌గా మస్కట్ పోతే సంపాదించవచ్చన్న ఆశతో వెళ్లి అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి చిక్కుకున్నాడని వివరించింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్తను కాల్డ్ ఔట్ పాస్ ద్వారా రప్పించాలని వేడుకుంటోంది. ఈ సందర్భంగా జ్యోతి ‘దిశ’తో మాట్లాడుతూ.. నక్కలపేటలో కరోనా కారణంగా పిల్లల్ని పోషించేందుకు ఉపాధి లేకపోవడంతో రెండు నెలలుగా తన పుట్టినింటికి వచ్చి ఉంటున్నానని కన్నీటి పర్యంతం అయింది.