విద్యుత్ శాఖలో కరోనా పంజా.. వెయ్యి మంది మృతి

by vinod kumar |
Corona, electricity workers
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఎందరో ప్రాణాలను బలితీసుకున్న ఈ మహమ్మారి దేశవ్యాప్తంగా విద్యుత్ శాఖకు చెందిన సుమారు వెయ్యి మందిని పొట్టన పెట్టుకున్నట్లు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) వెల్లడించింది. అలాగే 15 వేల మంది ఉద్యోగులకు ఈ వైరస్ సోకినట్లు తెలిపింది. మహారాష్ట్రలోనే 7,100 మంది విద్యుత్ ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా 210 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లో 4000 వేల మందికి వైరస్ బారిన పడగా 140 మరణించినట్లు పేర్కొంది.

మృతుల్లో యూపీకి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు, ఒకరు హరియాణాకు చెందిన చీఫ్ ఇంజినీర్ మరణించినట్లు ఏఐపీఈఎఫ్ వెల్లడించింది. అలాగే 20కిపైగా సూపరింటెండెంట్ ఇంజినీర్లు కూడా ఉన్నట్లు తెలిపింది. ఇందులో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్ కు చెందినవారే ఉన్నారు. హరియాణకు చెందిన 20 మంది ఉద్యోగులు మృతిచెందగా 900 మంది వైరస్ బారిన పడినట్లు ఏఐపీఈఎఫ్ తెలిపింది. పంజాబ్ లోనూ 20 మంది మరణించగా 700 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగులకు వ్యాక్సిన్ అందిచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కు ఏఐపీఈఎఫ్ లేఖ రాసింది. అయితే కొవిడ్ తో మృతిచెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందించాలని కేంద్ర విద్యుత్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలను ఏఐపీఈఎఫ్ కోరింది.

Advertisement

Next Story

Most Viewed