- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
38 ఏళ్లకు దొరికిన దొంగ
దిశ, వెబ్ డెస్క్: చట్టం నుంచి ఎవరు తప్పుంచుకోలేరనడానికి ఈ సంఘటనే నిదర్శనం. బ్యాంకు దోపిడీకీ పాల్పడి నాలుగు దశాబ్దాలుగా పోలీసుల కండ్లు కప్పి తప్పుంచుకుని తిరుగుతున్నా.. గజదొంగను గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు రాజస్థాన్ లో అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను బనస్కాంతకు చెందిన ఎస్పీ తరుణ్ కుమార్ దుగ్గల్ మీడియాకు వివరించారు.
1982 డిసెంబర్ 30న గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కేంద్రంలో అమిర్ ఘర్ బ్యాంక్ ఆప్ ఇండియాపై కొందరు దొంగలు దాడి చేసి రూ.1.32 లక్షలను దోచుకున్నారు. అడ్డువచ్చిన హెడ్ కానిస్టేబుల్ ను హతమర్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో నలుగురు మృతిచెందారు.
ప్రధాన నిందితుడైన దీప్ సింగ్ రాజ్ పుత్ 38 ఏళ్లుగా తప్పించుకోని తిరుగుతున్నాడు. అతడిపై దోపిడీ, దొంగతనంతోపాటు 9 కేసులు రాజస్థాన్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయ్యాయి. ఇటీవలదీప్ సింగ్ రాజ్ పుత్ ఆచూకీ తెలవడంతో పాలన్ పూర్ కు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం రాజస్థాన్ లోని బార్మెర్ కు వెళ్లి 68 ఏళ్ల దీప్ సింగ్ రాజ్ పుత్ ను అరెస్ట్ చేశారు.