- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దొంగే..కానీ దేశభక్తిలో కింగే !
దొంగకు దొంగతనం తప్ప సమాజం, దేశం గురించి పట్టింపులేవీ ఉండవని మనం అనుకుంటాం. దాదాపుగా అదే నిజం కావచ్చునేమో ! అయితే ఇక్కడో దొంగ మాత్రం.. మన నమ్మకాల మీద దెబ్బకొట్టాడు. కేరళ రాష్ట్రంలో ఓ ఇంటికి కన్నమేసేందుకు వచ్చి దేశభక్తి గుర్తుకురావడంతో తిరిగి వెళ్లిపోయిన ఘటన ఆసక్తిని కలిగిస్తోంది.
తిరువనాకులంలోని ఓ రిటైర్డ్ కల్నల్ ఇంట్లోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డ దొంగ.. అక్కడ ఆర్మీ ఆఫీసర్ క్యాప్‌ను చూసి దేశభక్తితో ఉప్పొంగిపోయాడు. ఆ ఇంట్లో దొంగతనం చేయకూడదని నిర్ణయించుకోవడమే కాకుండా, సెల్ఫ్ నుంచి తీసుకున్న మిలిటరీ మద్యం బాటిల్‌కు రూ.1500 అక్కడపెట్టి వెళ్లాడు. అంతేనా వెళ్లే ముందు గోడపై ‘ఇక్కడ టోపీ చూసిన తర్వాతనే ఇది ఆర్మీ ఆఫీసర్ ఇల్లని నాకు తెలిసింది. నాకు ముందే తెలిసుంటే లోపలికి వచ్చేవాడిని కాదు. నన్ను క్షమించండి’ అంటూ బైబిల్‌లోని పవిత్ర వ్యాఖ్యాలను కోట్ చేస్తూ రాశాడు. అంతేకాకుండా పక్కనే గల టైర్ల షాపు నుంచి దొంగిలించిన ఓ బ్యాగును కూడా అక్కడే వదిలి..అందులోని డాక్యుమెంట్లను తిరిగి ఆ షాపు యజమానికి తిరిగివ్వమని తన సందేశంలో పేర్కొన్నాడు.