ఉదయం గులాబీ కండువా.. రాత్రి కాషాయ కండువా

by Aamani |
ఉదయం గులాబీ కండువా.. రాత్రి కాషాయ కండువా
X

దిశ,దుబ్బాక : ఎన్నికల వేళ పార్టీలకు అయారామ్.. గయారాం బెడద ఎక్కువైంది. ఆదివారం ఉదయం సిద్దిపేటలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ నాయకులు రాత్రి దుబ్బాకలో ఎమ్మెల్యే మాధవనేని “సమక్షంలో కాషాయం కండువా కప్పుకోవడంపై ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో,ఎటు వైపు పోతున్నారో ప్రజలకు అంతుపట్టని వ్యవహారంలా మారింది. బీఆర్ఎస్ నాయకులు బీసీ బంధు ఇస్తానంటే నమ్మి లచ్చ పేట గ్రామ బీజేపీకి చెందిన అవధూత బాలరాజు, వడ్ల భారత్ చారి, అవధూత మధు రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ మాయ మాటలను గ్రహించి బీఆర్ఎస్ లో చేరిన కొద్ది గంటల్లోనే ఎమ్మెల్యే సమక్షంలో తిరిగి బీజేపీలో చేరారు. బీఆర్ఎ ఎస్ నాయకుల మాయమాటలకు ఆశపడి బీఆర్ఎస్ లో చేరామని తమను మోసం చేస్తున్నారని గ్రహించి సొంత పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మంత్రి బయట చెప్పేదొకటి. లోపల చేసేదొక్కటని, బీఆర్ఎస్ పార్టీలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్య తల్లి లాంటి బీజేపీ పార్టీని విడిచిపోమని అన్నారు.



Next Story