ప్రాణ స్నేహితుడని నమ్మినందుకు….

by Anukaran |   ( Updated:2020-09-07 11:46:26.0  )
ప్రాణ స్నేహితుడని నమ్మినందుకు….
X

దిశ వెబ్ డెస్క్: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ స్నేహితున్ని చంపాడో వ్యక్తి . ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం…అంబూరు జిల్లాలోని దేవలాపురం గ్రామపంచాయతీ పరిధిలో మణికందన్, అభిరామి దంపతులు నివాసం ఉంటున్నారు. మణికందన్ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. వారి ఇంటికి రామాపురంలో ఉండే రాజేష్ అనే స్నేహితుడు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మణికందన్ భార్యపై రాజేశ్ కన్ను పడింది.

కాగా కొద్ది నెలల క్రితం రాజేశ్, అభిరామీలు అంబూరులోని ఓ షూ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కాగా రాజేశ్ పై నమ్మకంతో మణికందన్ తన భార్యను రాజేశ్ బైక్ పై కంపెనీకి రోజూ పంపించేవాడు. దీంతో అభిరామితో రాజేశ్ మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడు. క్రమంగా ఆపీసు విధులు ముగిశాక వారిద్దరూ కలిసి నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకంతంగా గడిపేవారు.

అయితే వీరిద్దరిని గ్రామస్తులు గమనిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మణికందన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఓ రోజు వీరిద్దరిని మణికందన్ రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో వారిద్దరు తమ తప్పు ఒప్పుకున్నారు. ఇకపై ఇలాంటి తప్పుచేయబోమని చెప్పి బతిమిలాడటంతో మణికందన్ వారిని విడిచిపెట్టాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్లు మళ్లీ అదే తంతు కొనసాగించడంతో నేరుగా రాజేశ్ ఇంటికి వెళ్లి అతనిపై మణికందన్ పెట్రోల్ పోసి అంటించాడు. దీంతో రాజేశ్ మరణించాడు.

Advertisement

Next Story

Most Viewed