- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వైరస్.. 70 శాతం వేగంగా వ్యాప్తి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కాలం కంటిన్యూ అవుతోంది. కోవిడ్ – 19 రెండో దశ నడుస్తుండగానే.. మరో భారీ ముప్పు మనవ సమాజాన్ని భయపెడుతోంది. అసలు మనిషికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్లేనా..? ఈ వైరస్ ముప్పేట దాడి ఏంటి..? రానున్నది మరింత గడ్డుకాలమేనా.? 2020 ఏడాదిలో కరోనా ప్రపంచంతో ఆడుకుంటే.. 2021 మరో వైరస్ ఆడుకోనుందా..? మరో ఐదేళ్లలో ప్రపంచం రూపు రేఖలు మారిపోనున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే యూరప్ దేశాలను కొత్త రకం వైరస్ వణికిస్తోంది. బ్రిటన్ సహా ఆఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోంది. కరోనా వైరస్‌తో పాటు కొత్త వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి. కరోనా వైరస్‌తో సతమవుతుంటే మరో వైరస్‌ను ఎదుర్కొనే ధైర్యం చేయడం కన్నా ముందు జాగ్రత్త చర్యలే మేలు అని నెదర్లాండ్, బెల్జియం దేశాలు దక్షిణాఫ్రికా, బ్రిటన్ దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. తాజాగా జర్మనీ దేశం ఆ రెండు దేశాల నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించడానికి సిద్ధంగా ఉంది.
దీనిపై ఉన్నతస్థాయి సమావేశం కూడా జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ తమ వద్ద కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబందించిన కేసులు నమోదు కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో తాజాగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దీనిపై స్పందించారు. కొత్త రకం వైరస్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే దీనివల్ల ఎంత మేర ముప్పు ఉందనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. మరోవైపు కేరళలో షిగోలా వైరస్ వెలుగుచూసింది. ఈ రక్కసి ఒక చిన్నారిని కబలించింది. మరో ఆరుగురికి షిగోలా సోకిందని కేరళ ప్రభుత్వం స్పష్టంచేసింది. మిగతా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏ చిన్న అనుమానం వచ్చినా వైద్యులను సంప్రదించాలని కోరింది. ఉత్తర కేరళలో షిగోలా వైరస్ వ్యాప్తిచెందుతోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేరళ ఆరోగ్యమంత్రి కే కే శైలజ సూచించారు. కాలీకట్ జిల్లాలో 11 ఏళ్ల బాలిక షిగోలా వైరస్ వల్ల మృతి చెందిందని… ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలని ఆమె కోరారు. వైరస్ సోకినపుడు డయేరియా లక్షణాలు కనిపిస్తాయన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా షిగోలా వైరస్ రిపోర్టు వచ్చింది. కలుషిత నీటి కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అందరూ పరిశుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు 56 డయేరియా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఆరు షిగోలా వైరస్ కేసులను గుర్తించామని కోజికోడ్ జిల్లా మెడికల్ అధికారి తెలిపారు. బాధితులను కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని, వీరిలో కోలుకున్న కొందరిని డిశ్చార్జ్ చేశామన్నారు.
మిగిలిన బాధితులలో ఎవరు కూడా తీవ్ర అస్వస్థతకు గురి కాలేదన్నారు. అసలు ఈ వైరస్ ల కాలం ఏంటో అర్ధం కావడం లేదని శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. మున్ముందు వైరస్ లతో మనిషి జీవితం ముడి పడి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వైరస్ లతో పోరాడానికి మానవుడు సిద్ధం ఉండాలంటున్నారు. మరో 5 ఏళ్లలో చాలా వైరస్ లు ప్రపంచాన్ని పట్టి పీడిస్తాయని చెబుతున్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కన ప్రాంతాలను ప్రతిరోజు క్లీన్ గా ఉంచుకోవడంతో పాటు మనిషి అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. 2020లో కరోనాతో మొదలైన మనిషి వైరస్ ప్రయాణం.. మున్ముందు మరింత బలంగా కొనసాగుతుందని చెబుతున్నారు. సైంటిస్టుల హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అయినా ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పా ఈ వైరస్ లను అంతం చేయడం కష్టతరమనే భావన అన్నీ దేశాల్లో కలుగుతోంది. అందుకే కరోనా నేర్పిన పాఠాలను రాబోయే కాలంలో వైరస్ లను అడ్డుకునేందుకు శాయశక్తుల ప్రయత్నం చేసేందుకు సన్నద్ధం అవుతున్నాయి. మొత్తానికి భవిష్యత్తంతా.. మనిషి మనుగడ వైరస్ ల మీద నడకలా సాగుతుందనే చేదు నిజాన్ని చెప్పకనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అందుకే అందరు బాధ్యతగా పరిశుభ్రతను పాటించండి.. వైరస్ ల బారిన పడకుండా ఉండండి.