- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నక్సలైట్ స్మారక స్థూపం కూల్చివేత
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఓ నక్సలైట్ స్మారక స్థూపాన్ని పోలీసులు, గ్రామస్థులు కలిసి శుక్రవారం కూల్చివేశారు. హోందావాడ మార్గ్‌లోని కుర్సింగ్‌బహర్ గ్రామంలో ఓ మహిళా నక్సలైట్ స్మారకార్థం దీనిని నిర్మించారు. జిల్లాలో నక్సల్స్ నిర్మూళన కార్యక్రమంలో భాగంగా పోలీసు బలగాలు నక్సల్స్ ప్రభావిత గ్రామాలలో పర్యటించి ప్రజలతో ముచ్చటిస్తున్నారు. గ్రామాలలో మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని, సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా తమవంతు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇస్తున్నారు. పోలీసుల పట్ల గ్రామస్థులు నమ్మకాన్ని పెంపొందించుకొంటున్నారని, ఆ మేరకు అధికార యంత్రాంగానికి సహకరిస్తున్నారని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ్ తెలిపారు. నక్సలైట్ స్మారక స్థూపాన్ని గ్రామస్థులే కూల్చివేయడం ప్రజాచైతన్యంలో భాగమని పోలీసులు తెలిపారు.