చిత్తూరులో విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

by srinivas |   ( Updated:25 May 2021 1:30 AM  )
Neeraja, childrens
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం జిల్లాలోని రామచంద్రాపురంలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే.. పెనుమూరు మండలం, గుడియానం పల్లెకు చెందిన బి.కిపోర్ భార్య నీరజ(36), కూతురు చైత్ర(7), కుమారుడు చందు(3)గా పోలీసులు గుర్తించారు. నీరజ తిరుపతి స్విమ్స్‌లో నర్సుగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆదివారం నుంచి పిల్లలతో సహా ఆమె కనిపించకుండాపోయింది. దీంతో భర్త కిషోర్ భార్యా పిల్లలు కనిపించడం లేదని అదే రోజున పెనుమూరు పీఎస్‌లో చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం వద్ద ఓ క్వారీ గుంతలో గుర్తుతెలియని శవాలు ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నీరజ పిల్లలతో కలిసి స్కూటీపై అక్కడకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. క్వారీ గుంట పక్కనే ఉన్న షెడ్డు దగ్గర ఆమె స్కూటీ ఉంది. క్వారీ గుంతలో నీళ్లలోతు ఎక్కువగా ఉండడంతో అందులో దూకి బలన్మరణనానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉబ్బి ఉండడంతో ఈ ఘటన ఆదివారమే జరిగి ఉండొచ్చనుకుంటున్నారు. శవాలను వెలికితీయించారు. నీరజ భర్త కిషోర్ ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దే కోళ్లఫారం ఏర్పాటు చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య కలహాల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed