నిరాడంబరంగా బోనాలు.. భక్తి పరవశమాయే

by Anukaran |
నిరాడంబరంగా బోనాలు.. భక్తి పరవశమాయే
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో లష్కర్ బోనాలు కనుల పండువగా సాగింది. ఎటువంటి ఆర్భాటాలు లేకున్నా.. భక్తులు మాత్రం అమ్మవారికి పవిత్రంగా బోనాలు సమర్పించుకున్నారు. తెలంగాణ పండుగల్లో కీలకమైన బోనాలు నిరాడంబరంగా సాగడం ఇదే తొలిసారి.. కరోనా వైరస్ కారణంగా జన సమూహం లేకుండా పండగను ఎవరి ఇంట్లో వారే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది.

అయితే, కొన్ని చోట్ల ప్రధాన ఆలయాలు కాకుండా చిన్న చిన్న గుడిల వద్దనే భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. భక్తులు అధికంగా వచ్చే ఆలయాలను మాత్రం పోలీసులు దగ్గరుండి మూసివేశారు. కొన్ని చోట్ల బారీ కేడ్లు కూడా పెట్టారు. ఈ కరోనా కాలంలో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బంది, నిరుత్సాహం చెందకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. చాలా వరకు ప్రజలు వారి వారి ఇండ్ల వద్దనే బోనాలు సమర్పించారు. పలువురు మాత్రం అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోతురాజుల విన్యాసాలతో పండుగ ప్రత్యేకతను గుర్తు చేశారు. పండుగ చూడడానికి నిరాడంబరంగా సాగిన.. భక్తులు ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పిండం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed