కాంగ్రెస్ సీనియర్ నేతకు తప్పిన ప్రమాదం!

by Shyam |
కాంగ్రెస్ సీనియర్ నేతకు తప్పిన ప్రమాదం!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బుధవారం దామోదర్ రెడ్డి వెళ్తున్న కారును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు దగ్గర ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. దీంతో దామోదర్ వెళ్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ సమయంలో కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో దామోదర్ రెడ్డితో సహా ఆ కారులో ఉన్నవారు ప్రాణాలతో బయటపడినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రాస్తులు అక్కడికి చేరుకుని కారు అద్దాలు పగులగొట్టి అందులో చిక్కుకున్నవారిని రక్షించారు. విషయం తెలుసుకుని అక్కడి చేరుకున్న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

Advertisement

Next Story