కెమికల్ ట్యాంకర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

by Sumithra |   ( Updated:2021-05-13 04:54:43.0  )
కెమికల్ ట్యాంకర్‌లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో మరో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని బోయిసర్-తారాపూర్ ఎంఐడీసీ ప్రాంతంలోని సినాయ్ కంపెనీ వద్ద కెమికల్ ట్యాంకర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలు అక్కడ ఉంచిన ప్లాస్టిక్ పైపులకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఐదు ఫైర్ టెండర్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed