- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకు.. మూడో భార్య ఎంటర్ కావడంతో..
దిశ, బూర్గంపాడు: బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతమీపురం కాలనీకి చెందిన నిత్య పెళ్లికొడుకు ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గౌతమిపురం కాలనీకి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ ఇప్పటికే ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా మరో పెళ్లికి రెడీ అవ్వడంతో మూడో భార్య పాల్వంచ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో ఈ నిత్య పెళ్ళికొడుకు లీలలు బయట పడ్డాయి. మొదటిసారి పాల్వంచ ఏరియాకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. అమెకు పిల్లలు పుట్టకపోవడంతో పాల్వంచ కెటీపీఎస్ ఉద్యోగి భార్యను వల్లో వేసుకున్నాడు. పాల్వంచలో అమె ప్రోద్బలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి విచ్చలవిడిగా జల్సాలకు అలవాటు పడి అమ్మాయిలను టాప్ చేయడం మొదలు పెట్టాడు.
ప్రెస్ పేరుతో.. కాత్త నాటకం..
తన ఆగడాలకు అండగా ఉంటుందని ఓ యూట్యూబ్ చానల్ లో చేరాడు. దీంతో బూర్గంపాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం కావాలని మరి ప్రెస్ క్లబ్ సభ్యుల వెంట పడ్డాడు. కాగా విచ్చలవిడిగా ప్రెస్ పేరుతో తిరిగే వాళ్ళను దగ్గరకు రానీయకూడదనే ప్రెస్ క్లబ్ సభ్యులు సభ్యత్వానికి నిరాకరించారు. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహం చేసుకొని నిత్య పెళ్లికొడుకులా జల్సా చేస్తున్నాడు. తాజాగా మరో గిరిజన మహిళను వివాహాం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన మూడో భార్య పాల్వంచ టౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.