ప్రేమించుకున్నాం.. విడదీయకండి..

by Shyam |
ప్రేమించుకున్నాం.. విడదీయకండి..
X

దిశ, కోదాడ: గత రెండేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం.. కలిసి జీవించాలి అనుకుంటున్నాం.. దయచేసి మమ్మల్ని విడదీయకండి అని వేడుకుంటోంది ఓ ప్రేమ జంట. వివరాల్లో‎ వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‎కు చెందిన తేజావత్ మురళీకృష్ణ.. విజయవాడకు చెందిన వల్లపళ్ల మనీషా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ పెళ్లిని అంగీకరించని మనీషా బంధువులు వీరిని విడదీసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు.

మనీషా గత కొంతకాలంగా అడవిదేవులపల్లిలో తన బాబాయి, పిన్ని వాళ్లతో కలిసి ఉంది. అమ్మాయి మైనర్ అని దొంగ సర్టిఫికెట్లు సృష్టించి.. కేవలం 13ఏళ్లు ఉన్నాయని అడవి దేవులపల్లి పోలీస్ స్టేషన్‎లో మనీషా తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ జరపకుండానే మైనర్ బాలికను ఎలా పెళ్లి చేసుకున్నావ్ అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రేమ జంట ఆవేదన వ్యక్తం చేశారు. తాము కలిసి జీవించాలి అనుకుంటున్నామని.. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed