రైల్వే స్టేషన్‌లో కారు పార్కింగ్ చేస్తున్నారా..? ఆస్తులు అడుగుతున్నారు జాగ్రత్త!

by Shyam |
Secunderabad railway station
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ బెడద వెంటాడుతోంది. రోజు రోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రద్దీ ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేయడం నగరవాసులకు పెద్ద టాస్క్ గా మారింది. రోడ్డుపై పార్క్ చేస్తే.. ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు వేస్తుంటారు. ఈక్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వేలాదిగా వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం పేయిడ్ పార్కింగ్ అందుబాటులో ఉంది. అయితే ఓ నగరవాసి.. తన కుటుంబాన్ని రైలు ఎక్కించేందుకు వచ్చి పార్కింగ్‌లో కారు నిలిపి సహచరులను ట్రైన్ ఎక్కించి వచ్చారు. దాదాపు 30 నిమిషాల తర్వాత వచ్చి కారు తీసుకెళ్తుండగా పార్కింగ్ ఫీజు, జీఎస్టీలతో కలిపి రూ.500 బిల్ వేశారు.

అది చూసి కంగుతిన్న వాహనదారుడు చేసేదేమి లేక డబ్బులు చెల్లించి ట్వీట్టర్ వేదికగా ‘‘ Privatisation Shows its Colour. Parking a car for 31 minutes at a railway station now costs Rs.500 as parking charges. ’’ అంటూ ట్వీట్ చేశారు. రైల్వే స్టేషన్లు కూడా ప్రైవేటీకరణ చేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నెట్టింట చర్చ జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. రైల్వే శాఖ మంత్రిని ట్యాగ్ చేస్తూ దీనిపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలంటూ కోరారు.

Advertisement

Next Story

Most Viewed