- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కన్న కూతర్లపై లైంగిక వేధింపులు
దిశ, క్రైమ్ బ్యూరో: కన్న కుమార్తెలపై(మైనర్లు ) కర్కశంగా ప్రవర్తించి కాల యముడుగా మారిన తండ్రికి జీవిత ఖైధు విధించింది కోర్టు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జగద్గరిగుట్ట పీఎస్ పరిధిలోని సంగైపురి కాలనీలో మొగిలి అమర్ నాథ్ (45) రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ప్రస్తుతం తన రెండో భార్యతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. రోజూ మద్యం సేవించి కుమార్తెల పట్ల దురుసుగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పలుమార్లు బలత్కారం చేశాడు. అంతేగాకుండా తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు తీసి.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మీ ఇద్దరితో పాటు మీ అమ్మను కూడా చంపేస్తానని బెదిరించాడు.
ఈ విషయంపై ముందుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు అందగా, పోలీసులు కేసు నమోదు చేశారు. చార్జిషీటు దాఖలు అనంతరం జగద్గరి గుట్ట పీఎస్‌కు బదిలీ అయ్యింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో సాక్ష్యాధారాలను నిరూపించారు. దీంతో ఎల్‌బీ నగర్ 1వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి బి.సురేష్ మైనర్ బాలికలపై వేధింపులకు జీవిత ఖైధుతో పాటు రూ.26 వేల జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో కీలకంగా దర్యాప్తు నిర్వహించి, శిక్ష పడేలా పర్యవేక్షణ చేసిన బాలానగర్ డీసీపీ పీవీ పద్మజ, అడిషనల్ డీసీపీ ఇందిరా, బాలానగర్ ఏసీపీ పురుషోత్తంతో పాటు ఇంటిలిజెన్స్ డీఎస్పీ సుదర్శన్, అడిషనల్ పీపీ రాజిరెడ్డి, మహిళా కానిస్టేబుల్ ఎన్.కంకజా, హెడ్ కానిస్టేబుల్ శివారెడ్డి లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ అభినందించారు.