- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్‌కు అడ్డుగా ఉందని దాన్ని తీసేసిన రైతు.. షాక్‌లో దేశాలు
దిశ, వెబ్ డెస్క్ : మనం పొలంపనులు చేయడానికి ట్రాక్టర్ లేకా ఎడ్లబండి, హార్వెస్టర్ మిషన్ ఎదైనా మన పొలంలోకి వస్తే దానికి ఏం అడ్డుగా ఉండకుండా చూసుకుంటాం. త్వరగా పొలం పనులు చేసుకోవాలని చూస్తాం. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా… ఓ రైతు తన ట్రాక్టర్ తో పొలం పనులు చేసుకోవడాని రాయి అడ్డుగా ఉందని దాన్ని తొలింగించాడు. దానిలో విడ్డూరం ఏం ఉంది అనుకుంటున్నారా.. అయితే తాను తొలగించిన రాయి చిన్నా చితక రాయి కాదు ఏకంగా 1819 లో పాతిన రెండు దేశాల సరిహద్దు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతు కొద్ది రోజుల క్రితం తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొలం పనులు చేసుకోవటానికి తరచుగా ట్రాక్టర్‌కు అడ్డు వస్తుంది ఓ రాయి. దీంతో ఆ రాయిని అక్కడ ఎందుకు పాతారు ఏంటీ అని ఆలోచించకుండా దాన్ని 2.25 మీటర్లు వెనక్కు జరిపి, తన పని చేసుకుని వెళ్లిపోయాడు.
ఈ నేపథ్యంలో మూడు రోజుల తర్వాత కొందరు చరిత్రకారులు అటు వైపు వచ్చారు. 1819లో పాతిన ఫ్రాన్స్-బెల్జియం దేశాలకు సంబంధించిన ఆ సరిహద్దు రాయి ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వెనక్కు ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉండటాన్ని గుర్తించారు. దీంతో చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ మాట్లాడుతూ .. ఆ రైతు చాల మంచి పని చేశాడని, రైతు ఆ రాయిని జరపడం వలన బెల్జియం పెద్దదైంది.. ఫ్రాన్స్ చిన్నదైంది నాకు సంతోషం వేసిందన్నారు. దీనిపై స్పందించిన ఫ్రాన్స్ లోని భౌసిగ్నీ స్ మేయర్ సర్ రాక్ దాన్ని తిరిగి యధాస్థానంలో పెట్టాలని చెప్పడంతో తిరిగి ఆ రాయిని యధాస్థానంలో పెట్టారు. ఆ రైతు తెలిసి తెలియక చేసిన పని రెండు దేశల మధ్య గొడవక కారణం అయ్యేది కానీ అలా ఏం జరగలేదు.