- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మువ్వన్నెల జెండాతో రైతు సత్యాగ్రహ దీక్ష
దిశ, చిట్యాల: భూ తగాదాల్లో అన్యాయంగా తనపై ‘‘చిట్యాల పోలీసులు’’ కేసు నమోదు చేసారని మువ్వన్నెల జెండాను చేతపట్టుకొని తమ స్వంత పొలంలోనే ఓ రైతు సత్యాగ్రహ దీక్ష చేపట్టాడు. వివరాల్లోకి వెళితే… జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందిన ముకిరాల సూదయ్యకు నవాబుపేట గ్రామ శివారులో 1.27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో తమ దగ్గరి బంధువు అక్రమంగా తొమ్మిది గుంటల భూమి పట్టా చేసుకున్నాడని తెలిపారు. దీనిపై కోర్టును, రెవెన్యూ అధికారులను ఆశ్రయించామని తెలిపారు.
వివాదంలో ఉన్న ఆ భూమిని గత కొన్నేండ్లుగా సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నమన్నారు. తమ బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు తనపై అక్రమంగా కేసు బనాయించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు జోక్యం చేసుకున్న వివాదంలో పోలీసులకు ఏం పని అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు పోలీసులు తమ పై అక్రమంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన సొంత పొలంలో జాతీయ జెండా పట్టుకుని గత రెండ్రోజులుగా సత్యాగ్రహ దీక్ష చేపట్టి ఆందోళన చేస్తున్నాడు. దీనిపై చిట్యాల ఎస్సై వీరభద్రరావును వివరణ కోరగా సంబంధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.